ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ ఫై కోమటిరెడ్డి ఆగ్రహం

తెలంగాణ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాలు ప్రభుత్వం ఫై విమర్శలకు దారితీసింది. ఎన్నడూ లేని విధంగా 51 శాతం మంది ఫస్టియర్ విద్యార్థులు ఫెయిల్ అవ్వడంతో సర్కార్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఫెయిల్ అయ్యామన్న మనోవేదనతో రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్టూడెంట్స్ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు , బంద్ లు చేపడుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు.

‘గుర్తు పెట్టుకో కేసీఆర్..’ అంటూ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. దీనికి తెలంగాణ సీఎంవోతో పాటు మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ‘గుర్తుపెట్టుకో కేసీఆర్.. ఇంటర్ బోర్డు ఫెయిల్ చేసిన విద్యార్థులందరికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వస్తుంది..’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.. ‘వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మీకు, మీ పార్టీకి వచ్చే ఎన్నికలలో బాధిత విద్యార్థులు తగిన బుద్ధి చెప్పడం ఖాయం!’ అంటూ టీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ట్వీట్ చేసారు.

మరోపక్క ఫలితాల విషయమై విద్యార్ధుల నుంచి వ్య‌క్తమ‌వుతున్న‌ ఆందోళన మ‌రియు విద్యార్థి సంఘాల బంద్ పిలుపుల‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది
ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని.. త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇంటర్‌ ఫలితాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని.. గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ బోధనతో గ్రామీణ విద్యార్థులకు బోధన జరిగిందని స్పష్టం చేశారు.

గ‌తంలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన‌ప్పుడు ఎటువంటి చర్చ జ‌రిగిందో ఇప్పుడు అదే స్థాయిలో జ‌ర‌గ‌కుండా స‌మ‌స్య‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోన్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ తెలిపారు.