కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన వెంకట్ రెడ్డి

ఉదయం నుండి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని , కొత్త పార్టీ పెట్టబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చూసి అంత నిజమే కావొచ్చని భావించారు. అయితే ఈ ప్రచారం లో ఏమాత్రం నిజం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దంటూ సూచించారు. పార్టీ మారేది ఉంటే నేనే ప్రకటిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు.

నిన్నంతా కూడా సోనియాగాంధీ తోనే ఉన్నానని.. ఎప్పటికీ.. నేను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని ప్రకటించారు. పార్టీ మారేవాడినే అయితే పీసీపీ పదవి ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడినంటూ పేర్కొన్నారు. పార్టీ అధిష్టానంపై కొన్ని కామెంట్లు చేసిన మాట వాస్తవమే.. సోనియా, రాహుల్ గాంధీతో చర్చల తర్వాత మనసు మార్చుకున్నానన్నారు. తన సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని చెప్పారని.. కోమటిరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నానని తెలిపారు.