రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ హితవు

బిజెపి నేత , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ కి వేసినట్లేనని అన్నారు. నాయకత్వ లోపం వల్లే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీన పడిందన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని.. అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కేసీఆర్ తెలంగాణలో విశ్వాసం కోల్పోయిండన్నారు. రిపబ్లిక్ డే వేడుకలుజరపకుండా కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మునుగోడులో మందబలంతో, డబ్బుతో అప్రజాస్వామికంగా గెలిచారని ఆరోపించారు. నైతిక విజయం తనదేనన్నారు. గవర్నర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దుర్మార్గుడని..చదువురాని దద్దమ్మ అని రాజగోపాల్ విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏవిధంగా ఉందో బీఆర్ఎస్ నాయకుల మాటలు చూస్తే అర్థమవుతోందన్నారు.