కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రయోగం

కోల్‌కతా: ఐపిఎల్‌ 2019 సీజన్‌లోనూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌ తన ఓపెనింగ్‌ జోడీలో ప్రయోగాలు చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2018 సీజన్‌లో మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ను ప్రయోగాత్మక ఓపెనర్‌గా కోల్‌కతా ఆడించగా…అతను ప్రొఫెషనల్‌ ఓపెనర్‌ కంటే మెరుగ్గా రాణించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొలి పవర్‌ప్లేలో ఫీల్డర్ల పరిమితుల్ని సొమ్ము చేసుకున్న సునీల్‌ సరైన్‌ తనదైన హిట్టింగ్‌తో బౌండరీల మోత మోగించాడు. ఎంతలా అంటే…అతను టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌కి పోటీనిస్తూ సీజన్‌లో ఏకంగా 357 పరుగులు చేశాడు. బ్యాట్‌తోనే కాదు….బంతితోనూ రాణించిన ఈ మిస్టరీ స్పిన్నర్‌ 17 వికెట్లు పడగొట్టి…ఆల్‌రౌండర్‌ ఎదిగాడు. శనివారం నుంచి ఐపిఎల్‌ 2019 సీజన్‌ మ్యాచ్‌లు మొదలుకానుండగా…కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇటీవల గాయపడిన సునీల్‌ నరైన్‌…పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పిఎస్‌ఎల్‌)కి కూడా దూరంగా ఉన్నాడు. అతని చేతి వేలికి గాయమవడంతో క్రికెట్‌కి దూరంగా ఉంటున్న నరైన్‌…తాజాగా ఫిట్‌నెస్‌ సాధించినట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ కార్ల్‌ క్రో వెల్లడించాడు. అవును…చేతి వేలి గాయం కారణంగా పిఎస్‌ఎల్‌ టోర్నీకి నరైన్‌ దూరంగా ఉన్నాడు. కానీ…ఇప్పుడు అతను ఫిట్‌నెస్‌ సాధించాడు. 2019సీజన్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనని మనం చూడబోతున్నాం. ఈసారి బౌలింగ్‌లోనే కాదు…బ్యాటింగ్‌లోనూ అతను మెరుపులు మెరిపించనున్నాడని క్రో ధీమా వ్యక్తం చేశాడు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయరడి :