కోహ్లీ సంచలన నిర్ణయం : టెస్ట్ కెప్టెన్సీ కి గుడ్ బై

ట్విట్టర్ వేదికగా వెల్లడి

Kohli's decision-Goodbye to Test captaincy
Kohli’s decision-Goodbye to Test captaincy

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ . ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ట్విట్టర్‌లో ఒక మేసేజ్‌ను షేర్ చేశాడు. అంతకు ముందు వన్ డే, టీ-20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాభవం ఎదురు కావడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
టీమీండియాను సరి అయిన దిశలో నడిపించడానికి అలుపెరగకుండా 7ఏళ్లు పనిచేశాను. నీతి, నిజాయతీతో నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి పనికి ఒక ముగింపు ఉంటుంది. నాకు సంబంధించినంత వరకు టీమీండియా టెస్ట్ కెప్టెన్సీ ఆ ముగింపు అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు అనేక ఆటు పోట్లు ఎదురయ్యాయి. నేను ఎప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రతి పనిలో 120శాతం ఇవ్వాలని భావించాను. అందుకోసం నిర్విరామంగా పనిచేశాను.
నా మనస్సు చెప్పింది వినాలనుకుంటున్నాను. నా టీమ్‌తో ఎప్పుడు నిజాయతీగా ఉండాలని భావించాను. నాకు ఇన్ని ఏళ్లు కెప్టెన్సీ అవకాశం ఇచ్చినందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు థ్యాంక్స్ చెబుతున్నాను. నా విజన్‌ని ఆచరణలోకి తీసుకు వచ్చినందుకు టీమ్ మేట్స్‌కు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి రోజు టీమ్‌కు అండగా నేను ఉన్నాను. ఏ సమయంలోను ఓటమిని అంగీకరించలేదు. ఈ ప్రయాణాన్ని టీమ్ మేట్స్ అందరు నాకు తీపి జ్ఞాపకంగా మిగిల్చారు ’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

‘ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు నాకు ఎంతో మంది అండగా నిలిచారు. టెస్ట్ క్రికెట్‌ను ముందుకు తీసుకు వెళ్లడానికి రవిశాస్త్రితో పాటు అనేక మంది నన్ను వెనుక నుంచి నడిపించారు. నా విజన్‌ని ఆచరణలోకి తీసుకురావడానికి కృషి చేశారు. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు తీసుకు వెళ్లడానికి ఎమ్.ఎస్.ధోనీనే నన్ను గుర్తించాడు. అతడు కెప్టెన్‌గా నాపై ఎంతో నమ్మకముంచాడు. ధోనీకి బిగ్ థ్యాంక్ యూ’’ అని కోహ్లీ వివరించాడు.

తెర – సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/