కోహ్లీ కెప్టెన్సీపై మాజీల విమర్వల వెల్లువ…

virat kohli
virat kohli

న్యూఢిల్లీ: నాణ్యమైన ఆటగాళ్లున్నా రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు ఐపిఎల్‌లో ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. వరుసగా ఆరు ఓటములతో ఢీలా పడింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆజట్టు సారథ్యంపై మళ్లింది. ఇప్పటికే గౌతం గంభీర్‌తో పాటు చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ మంచి బ్యాట్స్‌మెన్‌ కావచ్చు. కానీ మంచి కెప్టెన్‌ మాత్రం కాదని అంటున్నారు. మరోవైపు…ఐపిఎల్‌ ప్రభావం ప్రపంచకప్‌ మీద పడకుండా ఉండాలంటే కోహ్లీ టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. రోహిత్‌శర్మ ముంబయి జట్టును మూడుసార్లు ఐపిఎల్‌ విజేతగా, ఒకసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా రోహిత్‌కు ఉంది అంటున్నారు. మాజీ క్రికెట్‌ దిగ్గజం మైఖెల్‌ వాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిస్తూ…భారత్‌ తెలివైన జట్టయితే ప్రపంచకప్‌లోసారథ్య బాధ్యతల నుంచి కోహ్లీకి విశ్రాంతి కల్పించాలని పేర్కొన్నాడు. కొంతమంది అభిమానులు మాత్రం…కోహ్లీ ఎప్పటికైనా ఉత్తమ కెప్టెన్‌గా రాణిస్తాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే బెంగళూరు జట్టు కూడా విజయాలు సాధిస్తుందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/