కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్ మెన్ ; ఇయాన్ ఛాపెల్

ian chappell
ian chappell

సిడ్నీ ; క్రికెట్ లో అత్యుత్తమంగా ప్రదర్శన చేసే బ్యాట్స్ మెన్స్ గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టింసిస్ దిగ్గజ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా మధ్య ఎవరు బెస్ట్ బ్యాట్స్ మెన్ అనే చర్చ సాగేది. అలాగే ప్రస్తుత క్రికెట్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ , ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య ఎవరు బెస్ట్ బ్యాట్స్ మెన్ అనే చర్చ నడుస్తుంది. తాజాగా క్రికెట్ విశ్లేషకుడు రౌనక్ కపూర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ ను ఇదే ప్రశ్న అడిగాడు దీనికి చాపెల్ సమాధానమిస్తూ కెప్టెన్ గా , బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నే బెస్ట్ అని పేర్కొన్నాడు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/telangana/