కోహ్లీ అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తున్నాడు

పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ జహీర్‌ అబ్బాస్‌ అభిప్రాయం

zaheer abbas
zaheer abbas

ఇస్లామాబాద్‌: ప్రస్తుత క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అనే చర్చ జరుగుతుంది. ఈ విషయంలో కోందరు స్మిత్‌ అంటే, మరికొందరు విరాట్‌ కోహ్లీ అని తెలుపుతున్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అనే విషయంపై పాకిస్తాన్‌ మాజీ బ్యాట్స్‌ మన్‌ జహీర్‌ అబ్బాస్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆట పరంగా కోహ్లీ, స్మిత్‌లు ఇద్దరు సమ ఉజ్జీలు. అయితే స్మిత్‌ ఎక్కువగా టెస్టుల్లో రాణిస్తాడని, టెస్టుల్లో భారీ స్కోరు చేస్తున్నట్లు అతని గణాంకాలు తెలుపుతున్నాయన్నాడు. కాని కోహ్లీ అన్ని ఫార్మాట్‌లలో రాణించస్తున్నాడు. అని అన్నాడు. ప్రపంచశ్రేణి అత్యుత్తమ బ్యాట్స్‌ మన్‌ అవ్వాలంటే అన్ని ఫార్మాట్‌లలో రాణించాలని అన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/