ప్రేక్షకుల పట్ల విరాట్ కోహ్లీ అసహనం!

Virat Kohli
Virat Kohli

బెంగళూరు: చిన్న స్వామి స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (89, 91 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. సెంచరీ తర్వాత కోహ్లీ దూకుడుని చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఆర్సీబీ కాదని… టీమిండియాకు ఛీర్స్ చెప్పాలంటూ తన టీషర్ట్‌పై రాసి ఉన్న టీమిండియాను చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సొంత మైదానం కూడా చిన్నస్వామి స్టేడియం కావడం విశేషం. ఇందుచేతనే మూడో వన్డేకు హాజరైన అభిమానులు టీమిండియా అని కాకుండా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/