టూర్లకు భార్యలనూ అనుమతించండి: విరాట్‌

KOHLI, ANUSKA
KOHLI, ANUSKA

టూర్లకు భార్యలనూ అనుమతించండి: విరాట్‌

న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్‌ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బిసిసిఐని కోరాడు. అయితే బిసిసిఐ ప్రస్తుత పాలసీ ప్రకారం ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తారు. ఈ పాలసీని మార్చాలని కోహ్లీ తొలుత ఓ బిసిసిఐ ఉన్నతాధికారి దగ్గర ప్రస్తావించగా…అతను వినోద్‌రా§్‌ు నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సిఓఏ)కి చెప్పారు. ఇందుకు సంబంధించిన అధికారిక అభ్యర్థనను టీమిండియా మేనేజర్‌ ద్వారా పంపాలని సిఓఏ తెలిపింది. అయితే దీనిపై సిఓఏ కొత్త బిసిసిఐ కార్యవర్గం ఏర్పడ్డ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలనే అభ్యర్థన కొన్ని వారాల క్రితమే వచ్చింది. అయితే ఇది బిసిసిఐ విధాన నిర్ణయం కావున ఇందుకు సంబంధించి అధికారిక అభ్యర్థనను మేనేజర్‌ పంపాల్సి ఉంటుంది. కోహ్లీతో కలిసి అనుష్క విదేశీ పర్యటనలకు వెళ్తోంది. అయితే పాత నిబంధనలను మార్చి టూర్‌ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలను అనుమతించాలని కోహ్లీ కోరుతున్నాడని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. భార్యలను, గర్ల్‌ ఫ్రెండ్స్‌ను క్రికెటర్లతో అనుమతించడం వల్ల గతంలో చోటుచేసుకున్న సమస్యల నేపథ్యంలో చాలా దేశాలు తమ ఆటగాళ్ల వెంట భార్యలు, స్నేహితురాళ్లను తీసుకెళ్లడంపై నిబంధనలు విధించాయి.