కుదిరిన భూఒప్పందం: ముగిసిన వివాదం

KODELA
KODELA

కుదిరిన భూఒప్పందం
ముగిసిన వివాదం

బేగంపేట: దశాబ్ధాల వివాదానికి తెర దించడం లో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిజీ చొరవ చూపడం సంతోషంగా ఉందని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొ న్నారు. జఠిలమైన భూసమస్యను కోర్టుబయటే పరిష్కారం చేయడంలో సహకరించిన పుష్పగిరి పీఠం ప్రతినిధులకుకూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. పుష్పగిరి మఠానికి గుంటూరు జిల్ల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట, నూజెళ్లపల్లిలో సుమారు 1700 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గత వంద సంవత్సరాలక్రితం నుంచి స్థాని కంగా ఉంటున్న రైతులు సాగు చేసుకుంటూ అప్పట్లో పుష్పగిరి మఠా నికి కౌలు చెల్లించేవారు. కాలక్రమంలో ఈ భూమికి సంబంధించి కౌలుదారులు పుష్పగిరి మఠానికి కౌలు చెల్లించడంలేదు. దీంతో పుష్ప గిరి మఠం నిర్వహకులు లింగంగుంట, నూజెళ్లపల్లిలోని తమ భూము లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి ప్రతిగా రైతులు సైతం కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ భూమి విషయంలో రైతు లు, పుష్పగిరి మఠంమధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు లో ఈ భూముల విషయంపై మఠానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.