కోడెల శివప్రసాద్ కు గుండెపోటు

Kodela Shiva Prasad
Kodela Shiva Prasad

అమరావతి: ఏపి శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి ఆయన తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కోడెల ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన కుమారుడు, కుమార్తెపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారం కొనసాగుతుండగానే అసెంబ్లీ ఫర్నిచర్ వివాదం చుట్టుముట్టింది. తాజాగా, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు మాయం చేశాడంటూ అతడి కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు వ్యవహారాలపై విచారణ కొనసాగుతోంది. తన కుటుంబంపై వరుసపెట్టి ఆరోపణలు రావడం, కేసుల వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఆయన గుండెపోటుకు అదే కారణమని భావిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/