మోదీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడరు

kodela siva prasad
kodela siva prasad

గుంటూరు: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ మాట్లాడడని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన మరుక్షణమే జగన్ జైలుకెళ్తాడని చెప్పారు. మోదీ స్వతంత్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గాలకు పాల్పడుతోందన్నారు.