జగన్‌ మాట్లాడేదానికి చేసే దానికి పొంతన లేదు

Kodela Shiva Prasad
Kodela Shiva Prasad

గుంటూరు: ఏపి మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సిఎం జగన్‌ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్‌ఆర్‌సిపికి 22 మంది ఎంపిలు ఉన్న ఏపికి ప్రత్యేక హాదా సాధించలేకపోయారు. జగన్‌కు చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై లేదని కోడెల విమర్శించారు. ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేసి ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. ఎంతసేపూ టిడిపి నేతలను ఎలా ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నారని విమర్శించారు. ఇక అసెంబ్లీ వ్యవహారాలైతే సరిగా జరగడం లేదని ఆరోపించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/