రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది : కోదండ‌రామ్

హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న జల సాధన దీక్షలో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరామ్ మెదక్ జిల్లా తూప్రాన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎలాంటి లాభం చేకూరలేదని.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు ఎక్కడా జరగలేదని అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారని కోదండరామ్ అన్నారు. ప్రగతి భవన్ లో కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతుందని, తెలంగాణ వారికి ప్రవేశం లేదన్నారు. ఉద్యమకారులు ఏకమై మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరామ్ అన్నారు. జూన్ 6వ తేదీన నిర్వహించే టీజేఎస్ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సభకు పార్టీలకతీతంగా ఉద్యమకారులు హాజరుకానున్నట్లు కోదండరామ్ తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/