ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడం లేదు

Kodandaram
Kodandaram

Hyderabad: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిని ఆయన ఎల్‌.రమణ, చాడలతో కలిసి సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కోదండరామ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. చాలా మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలు ఖర్చు చేస్తున్నారన్నారు.