అమిత్ షా – ఎన్టీఆర్ భేటీ ఫై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

నిన్న రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయినా సంగతి తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలతో పాటు , ఎన్టీఆర్ కొత్త చిత్రాల తాలూకా విషయాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి భోజనం చేసారు. ఇది రాజకీయ కలయిక కాదని కేవలం ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటన చూసి ఎంతో నచ్చడంతో ఆయన్ను కలవడం జరిగిందని బిజెపి నేతలు క్లారిటీ ఇచ్చారు.

వీరిద్దరి భేటీ ఫై వైస్సార్సీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో, అమిత్ షా సమావేశం అయ్యారని భావిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపరచుకోవడానికే కేంద్రమంత్రి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు తో ప్రయోజనం లేకే ఢిల్లీ వచ్చినా మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని కొడాలి నాని పేర్కొన్నారు.