ఆ మూడు చానెల్స్ ను నిషేధిస్తున్నాం – కొడాలి నాని

Kodali Nani

వైసీపీ సర్కార్ ఫై తప్పుడు కథనాలు రాస్తున్న ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 ను నిషేధిస్తున్నామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు. నిరంతరం తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లను బ్యాన్‌ చేస్తున్నామని , మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఇది అమలు చేస్తున్నామని తెలిపారు.

గురువారం తాడేపల్లిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు, రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్లు ఉంది టీడీపి మీడియా తీరు ఉందని.. హెరిటేజ్ లో రేట్ల కంటే మార్కెట్ రేట్ ఎక్కువగా ఉందని ఫైర్ అయ్యారు. హెరిటేజ్ లో ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ 59 ఉంటే మార్కెట్ రేట్ 52 రూపాయలు ఉందని.. అలాగే అన్ని నిత్యావసర సరుకుల ధరలు మార్కెట్ రేట్ కంటే హెరిటేజ్ లో ఎక్కువగా ఉన్నాయని నిప్పులు చెరిగారు. కొన్ని మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ నాయకులు ఎవరూ ఈ ఛానళ్ళకు ఇంటర్వ్యూ లు కూడా ఇవ్వకూడదని స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దించి నువ్వు(చంద్రబాబు) కుర్చీ ఎక్కితే తాను రాజకీమాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు ఛాలెంజ్‌ విసిరారు. హైదరాబాద్‌లో ఎయిర్ పోర్ట్, రింగురోడ్డు నువ్వే వేసినట్టు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా. ఎవరో చేసినదాన్ని నువ్వు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎంగిలిమెతుకుల కోసం పాకులాడే తత్వం నీది. కుల‌ పత్రికలు, కుల టీవీలు పెట్టుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూడొద్దు. రాష్ట్రానికి పట్టిన వైరస్, శని చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.