కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేశవరావు

బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ అత్యంత సన్నిహితుడు కే. కేశవరావు ..ఈరోజు బుధువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కేశవరావు గుర్తింపు పొందారు. అనేక పదవులు కూడా అనుభవించారు.

అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ తో కలిసి పని చేస్తూ కీలక పదవులు అనుభవించారు. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. అయితే ఆమెకు మేయర్ స్థానాన్ని కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన కుమారుడు విప్లవ్ కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావటంతో… పరిణామాలన్నీ మారిపోయాయి.వరుస పెట్టి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఈ క్రమంలో విజయలక్ష్మీ కూడా కొద్దీ రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరారు. అప్పుడే కేకే కూడా చేరతారని అనుకున్నారు కానీ ఆయన మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చి ఈరోజు చేరారు.