చేతులు పొడిబారకుండా..

మహిళలకు చిట్కాలు

Without drying hands
Without drying hands

వంటపాత్రలు కడగడం, గచ్చు తుడవటం, బట్టలు ఉతకడం వల్ల చేతులు పొడిబారుతుంటాయి. అందుకు సరైన డిష్‌వాష్‌ సబ్బు, స్పాంజిని వాడాలి. అది చర్మానికి పెద్దగా హాని కలిగించదు.

చేతులు పొడిబారకుండా ఉండటానికి సబ్బు నీటిని చేతులకు అంటు కోనివ్వకుండా చేసే స్పాంజిని ఉపయోగించాలి.

పాత్రలను శుభ్రపరిచేటప్పుడు డిష్‌ వాషింగ్‌ గ్లోవ్స్‌ ధరించాలి. ఇది సబ్బు, మిగిలిపోయిన ఆహారం గోళ్లు, చేతిలోకి రాకుండా చేస్తుంది.

కొన్ని రకాల సబ్బులు చేతులకు హనికలిగించే రసాయనాలు కలిగి ఉంటాయి.

వాటితో చర్మం మీద కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి సబ్బులను వాడకపోవడమే మంచిది. డిష్‌వాష్‌ సోప్స్‌నుబ్రాండెడ్‌వి ఎంచుకోవాలి.

లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. గ్లోవ్స్‌ను పరిశుభ్రంగా ఉంచాలి.

అవి పొడిగా ఉండేలా చూసుకోవాలి. వంటకు, వంట సామాగ్రిని కడగడానికి వేడి నీటి వాడకాన్ని నివారించాలి. వేడి నీరు చర్మంపై సహజమైన తేమను తీసివేసి చేతులు కరుకుగా, పొడిగా మారుతాయి.

గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. చేతులకు మాయిశ్చరైజర్‌ వాడాలి. నిద్రపోయే ముందు చేతులకు హ్యాండ్‌ క్రీమ్‌ రాయాలి.

గోళ్లలో కొబ్బరి నూనె లేదా బాదం నేనె వేయాలి. దాంతో గోళ్లు పొడిబారకుండా ఉంటాయి. చేతులు మృదువుగా మారతాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/