ఇలా చేస్తే సరి

మహిళలకు వంటింటి చిట్కాలు

Kitchen tips for women
Kitchen tips for women

మాంసం కుక్కరులో పెడితే మామూలుగా ఉడికిపోతుంది. కుక్కరు లేనప్పుడు ఒక పట్టాన ఉడకదు. ఒకోసారి ముందు ఉప్పు వేయకుండా, వంట షోడా వేయాలి.

చిటికెడు. అప్పటిఇ ఉడకపోతేొక పోకచెక్క వేయండి. ఇంకా మాట వినకపోతే బొప్పాయి పచ్చిముక్కను ఒక్కటి వేయాలి.

సామాన్యంగా ఈ మూడింటిలో వెనుక చెప్పిన రెండు చిట్కాలకు తొందరగా లొంగుతుంది.
బట్టలపై వార్నిష్‌ బూట్‌ పాలిష్‌ మరకల్ని కిరసనాయిల్‌తోగాని, కర్పూర తైలంతోగాని ఉతికి ఆ తర్వాత సబ్బుతో ఉతకాలి.

జిడ్డు సంబంధమైన మరకలుంటే ఆ మరకలపై ఫేస్‌ పౌడర్‌ రాసి తర్వాత సబ్బు నీటితో శుభ్రం చేయాలి.

కడుపులో పురుగులున్నవారు మాచిపత్రి, మిరియాలు తగినంత ఉప్పువేసి నూరి, చిన్నచిన్న ఉండలుగా చేసి కొన్ని రోజులు తింటే తగ్గిపోతాయి.

నెగగడ్డలు-కురుపులు మొదలైనవి వస్తే, వాిపైన నెయ్యిరాసి, దానిపైన గంగరావి ఆకువేసి కడితే వెంటనే తగ్గిపోతాయి.

పిప్పిగోళ్లకు గంధకం,మైలు తుత్తం, పాదరసం, పటిక, సాంబ్రాణి, ముద్దకర్పూరం వేసి మెత్తగా నూరి, నిమ్మపండు రసం వేసి కలిపి అది గోళ్లకు పెట్టుకుంటే తగ్గిపోతాయి.

సూట్‌కేసులు, బ్యాగులు ఏవైనా లెదర్‌ వస్తువులను పెట్రోలుతో తుడిస్తే కాంతివంతంగా టాయి.

బూట్‌పాలిష్‌ ఎండిపోతే టర్పంటైన్‌ కాస్తపోస్తే రిగి వాడుకోవచ్చు.
అరటిపండ్లు నవనవలాడుతూ నిల్వ ఉండాలంటే తడి ఇసుకలో కప్పిపెడితే బాగుంటాయి.

చిక్కుడూకు, దొండాకు, ఉమ్మెత్తఆకు సమపాళ్లల్లో తీసుకొని కలిపి మర్దన చేస్తే అరికాళ్ల మంటలు తగ్గిపోతాయి.

నిమ్మకాయను మరుగుచున్న నీటిలో వేసి, కొన్ని సెకనులు ఉంచి తీసి పిండితే రెట్టింపు రసం వస్తుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/