‘చెలి’ చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips

తోలు వస్తువులపై ఏర్పడిన ఫంగస్‌ మచ్చలను పెట్రోలియమ్‌తో తొలగించవచ్చు.

సింక్‌లో సరిగ్గా నీరు పోకపోతే వేడినీళ్లల్లో ఉప్పు కలిపి అందులో పోస్తే మధ్యలో ఏమైనా చిక్కుకుని ఉంటే సులువుగా పోతాయి.

ఫర్నీచర్‌కు ఉన్న పాత ఆయిల్‌పెయింట్‌ను తొలగించాలంటే అమ్మోనియాను పూయాలి.

భోజనం చేసిన తరువాత రెండు లవం గాలు తీసుకున్నా, జామ ఆకులను నమలినా తాజాశ్వాసతో హుషారుగా ఉండడమే కాదు, నోటి దుర్వాసన కూడా ఉండదు.

కరక్కాయ పెచ్చులు, గుగ్గిలం, యస్టిమధుకం, తేనెమైనం, జిగటమన్ను, జీలకర్ర వీటన్నింటినీ సమానంగా తీసుకుని కొద్దిగా ఆవునెయ్యి కలిపి బాగా మెత్తగా నూరి కాలిన పుండ్ల మీద రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి.

కోడిగుడ్డు సొనలో తుమ్మజిగురు కలిపి కాలిన ప్రదేశంలో లేపనం చేస్తే కాలడం వలన కలిగిన గాయాలు, కాల్పుల వల్ల ఏర్పడిన మంట తగ్గిపోతుంది.