సల్మాన్ సినిమాలో బతుకమ్మ సాంగ్..

ఇటీవల తెలంగాణ నేపధ్య కథలు , పాటలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యం గా తెలంగాణ యాస ను హీరోలు సంబోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బలగం , దసరా చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అలాగే పలు సినిమాల్లో బతుకమ్మ ఫై సాంగ్స్ చిత్రకరించడం జరిగింది. తాజాగా ఇక ఇప్పుడు హిందీ లో బతుకమ్మ సాంగ్స్ వచ్చాయి.

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2014లో అజిత్ చేసిన ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా రూపొందింది. ఏప్రిల్ 21వ తేదీన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సల్మాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఫర్హాద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచగా..తాజాగా సినిమాలోని ‘బతుకమ్మ’ నేపథ్యంలో సాగే పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ను సల్మాన్ .. వెంకటేశ్ .. పూజ హెగ్డే .. భూమికపై చిత్రీకరించారు.

YouTube video