ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిదే అధికారం

ఆప్‌ పోవాలి..బిజెపి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

kishan reddy
kishan reddy

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆశభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో తెలుగువారితో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..ఇంతకముందుతో పొలిస్తే ఢిల్లీలో పరిస్థితి మారిందని ఆప్‌ పోవాలి..బిజెపి రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీకి కేంద్రం ఇస్తున్న నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశ వ్యతిరేక శక్తులు, విభజనవాదులతో కలిసి ఆప్‌ ఢిల్లీలో పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. షహీన్‌బాగ్‌లో కేజ్రీవాల్‌ ధర్నాలు చేయిస్తున్నారని, సీఎం కావడమే ఆయన లక్ష్యంగా ఉచిత పథకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిసున్నారని అన్నారు. ప్రజలు ఉచిత పథాకలు కోరుకోవడం లేదని..మౌళిక సదుపాయాలు, గృహకల్పన, కాలుష్య రహిత ఢిల్లీని కోరుకుంటున్నారని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/