సికింద్రాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర

Union Minister Kishan Reddy’s Padayatra in Secunderabad Constituency

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. అడ్డగుట్ట, తుకారం గేట్, తార్నాక, లాలపేట్, మెట్టుగూడలో కిషన్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. బస్తీవాసులను అడిగి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం బోరబండ, ఎర్రగడ్డలో ఆయన పర్యటించనున్నారు.

స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మంత్రి కిషన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.


అడ్డగుట్టలో పాదయాత్రకు వెళ్లిన ఆయనకు.. అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. సోమవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమని కిషన్ రెడ్డి అన్నారు. ఇక కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇవాళ పూర్తిగా సికింద్రాబాద్ అసెంబ్లీ పరిధిలోనే ఆయన పర్యటించనున్నారు.