నిధులు ఇప్పిస్తే కిషన్‌రెడ్డికి సన్మానాలు చేస్తాం

మెట్రో ఓపెనింగ్‌పై ఆయనది అనవసర రాద్ధాంతం

karne prabhakar
karne prabhakar

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నిధులు ఇప్పిస్తే..తాము దగ్గరుండి సన్మానాలు చేస్తామని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. మెట్రో రైలు ఓపెనింగ్‌పై కిషన్‌ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కర్నే ప్రభాకర్‌ విమర్శించారు. ఆదివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రోకు నిధులు అడగొద్దు అంటూ కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌ రెడ్డి ఢిల్లీ నాయకుడిలా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని కిషన్‌ రెడ్డికి సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/