సిఏఏ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదు

సిఏఏ, ఎన్‌ఆర్‌సి అవగాహన సదస్సులో కిషన్‌ రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం పై నిరసనలు జరుగుతున్నాయి, అయితే సిఏఏ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. సిఏఏ, ఎన్‌ఆర్‌సిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని నిరసనలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా సిఏఏను దేశంలో అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు కలిసి మోడి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీసులపై జరిగిన దాడులను గుర్తు చేస్తూ.. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరాదని హెచ్చరించారు. అంతేకాకుండా పాక్‌, బంగ్లాదేశ్‌లో ఉన్న మైనారిటీ రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ఆ దేశాలను ఇస్లామిక్‌ దేశాలుగా మార్చారని తెలిపారు. పాకిస్థాన్‌లో మైనారిటీలు 3 శాతానికి పడిపోయారు. మైనారిటీలంతా ఏమయ్యారు? చాలా మందిని హత్య చేశారు. అందుకోసమే బిజెపి ప్రభుత్వం 2015లోనే ఈ చట్టాన్ని తీసుకురావడానికి యత్నించిదన్నారు. కాకాపోతే రాజ్యసభలో మెజార్టీ లేనందున అప్పుడు ఆమోదం పొందలేకపోయిందని కిషన్‌ రెడ్డి అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/