ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదు

Kishan Reddy
Kishan Reddy

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఏపి రాజధాని మార్పుపై స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల్లో కూడా వాస్తవం లేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. తమ పార్టీ లక్ష్యం మున్సిపల్‌ ఎన్నికలు కాదని.. 2023లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
మరోవైపు బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. నడ్డా ఎవరో తెలియదనడం కెటిఆర్‌ అహంకార వైఖరికి నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయనెవరో తెలియనప్పడు గతంలో కేటీఆర్‌ నడ్డాను ఎలా కలిశారని నిలదీశారు. రాష్ట్రంలో బిజెపి లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/