హైదరాబాద్ లో రోడ్లన్నీ ఆధ్వానం -గుంతలు కూడా పూడ్చలేక పోయారు

‘మీట్‌ ద ప్రెస్’ లో తెరాసపై కిషన్ రెడ్డి ధ్వజం

Union Minister Kishan Reddy
Union Minister Kishan Reddy

Hyderabad: రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేరా? అంటూ తెరాసను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు .

హైదరాబాద్‌లో మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

ప్రచారానికి తక్కువ సమయం ఉన్నా సద్వినియోగం చేసుకుంటామన్నారు. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల హామీ ఏమైందని తెరాసను ప్రశ్నించారు. 

ఐదేళ్లు పూర్తయినా పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని తెరాసను ప్రజలు ప్రశ్నించాలని అన్నారు

పాతబస్తీని ఇస్తాంబుల్‌, కొత్త నగరాన్ని డల్లాస్‌గా మారుస్తామన్నారు ఏమైంది. రోడ్లపై గుంత చూపిస్తే రూ.వెయ్యి ఇస్తామన్నారు, భాగ్యనగరంలో రోడ్లన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు.

రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేశామంటున్నారు.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేరా?.. హైదరాబాద్‌కు అనేక హామీలు ఇచ్చి విస్మరించారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రజలు ప్రశ్నించాలని. హైదరాబాద్‌ సముద్రంగా మారడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని , నగరంలో సుమారు 6లక్షల ఇళ్లలోకి నీరు చేరిందన్నారు.

వరదల కారణంగా 40మంది అమాయక ప్రజలు చనిపోయారని తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/