కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అగ్రం వ్యక్తం చేసారు బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో గవర్నర్‌ను కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేడన్న ఫ్రస్టేషన్‌లో కేసీఆర్ ఇలాంటివన్నీ చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. సీఎం సంప్రదాయాలను మంటగలుపుతున్నారని.. గవర్నర్‌కు ప్రొటోకాల్ పాటించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కేసీఆర్ తన కాళ్ల కింద భూమి కదిలిపోతుందన్న ఆందోళనలో ఉన్నారని.. త్వరలోనే టీఆర్ఎస్ సర్కార్‌ను ప్రజలు పాతరేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. నిరాశ, నిస్పృహతో కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారని.. దేశాన్ని ఉద్దరిస్తావంటూ ప్రశ్నించారు. ఇంజనీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను నిర్మించి..ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సెంటిమెంట్తో ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ ఎక్కువ కాలం కూర్చోలేడని చెప్పారు.