కిరణ్ అబ్బవరం ‘మీటర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. రీసెంట్ గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా తో వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్..ఇప్పుడు మీటర్ అంటూ మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాప్ – మైత్రీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు. బుధువారం సాయంత్రం కిరణ్ అబ్బవరం తాలుకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఏప్రిల్ 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది.