వారిని స్వదేశానికి తీసుకురావాలి : కెటిఆర్‌

కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి కెటిఆర్‌ ట్వీట్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి ట్వీట్‌ చేశారు. మనీలా, కౌలాలంపూర్‌, రోమ్‌లోని విమానాశ్రయాలోచిక్కుకుపోయిన భారతీయుల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వారి పరిస్థితుల గురించి వెంటనే స్పందించి, వారిని స్వదేశానికి తీసుకురావాలని తాను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. కాగా, తెలుగు విద్యార్థులు స్వదేశానికి రాలేక కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే, పలు ప్రాంతాల్లో భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పలు దేశాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తుండడంతో భారతీయులు స్వదేశానికి బయల్దేరుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/