దక్షిణ కొరియాపై సైనిక చర్యలొద్దు..కిమ్‌

Kim Jong Un
Kim Jong Un

పోంగ్యాంగ్‌: ద‌క్షిణ కొరియాపై ఎటువంటి సైనిక చ‌ర్య‌కు దిగ‌డం లేద‌ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ వున్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవ‌ల ఈ రెండు దేశాల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. ఓ ద‌శ‌లో ద‌క్షిణ కొరియాపై యుద్ధానికి వెళ్లేందుకు ఉత్త‌ర కొరియా సిద్ద‌మైంది. కానీ ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మిష‌న్‌తో జ‌రిగిన వీడియోకాన్ఫ‌రెన్స్‌లో కిమ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ద‌క్షిణ‌కొరియాతో ఉన్న దౌత్య‌ప‌ర‌మైన అన్ని సంబంధాల‌ను కిమ్ ప్ర‌భుత్వం తెంచుకున్న‌ది. రెండు దేశాధ్య‌క్షుల భ‌వనాల‌ను క‌లిపే హాట్‌లైన్ క‌నెక్ష‌న్‌ను కూడా మూసివేశారు.


ఇటీవ‌ల స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉత్త‌ర కొరియాకు వ్య‌తిరేకంగా ద‌క్షిణ‌కొరియా కొన్ని సందేశ ప‌త్రాల‌‌ను జార‌విడిచింది. బెలూన్ల‌తోనూ వ్య‌తిరేక నినాదాలు చేశారు. కిమ్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఉత్త‌ర కొరియా సైనిక చ‌ర్య‌కు దిగుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ద‌క్షిణ కొరియాపై సైనిక చ‌ర్య‌కు రెడీగా ఉండాల‌ని ఇటీవ‌ల కిమ్ సోద‌రి కిమ్ యో జాంగ్ త‌మ దేశ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెండు కొరియా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు పెరిగాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/