కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం
Kim Jong Un
సియోల్: కరోనా ప్రారంభం నుంచి ఉత్తర కొరియా చర్యలు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపధ్యలోనే పేద దేశాలను ఆదుకునేందుకు ‘‘కొవ్యాక్స్’’ కార్యక్రమం కింద ఐక్యరాజ్య సమితి ఇవ్వనున్న టీకాలను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తిరస్కరించారు. ఈ మేరకు గురువారం పొలిట్‌బ్యూరో సమావేశంలో కిమ్ నిర్ణయం తీసుకున్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
కాగా, దేశంలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తరకొరియా చెప్పుకుంటోంది. పొలిట్‌బ్యూరో సమావేశంలో కిమ్ దీనిని ప్రస్తావిస్తూ.. మహమ్మారి వ్యాప్తి నిరోధంలో ఇకపైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కార్యకర్తలకు తగు విధంగా శిక్షణ ఇవ్వాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/