దేశంలో ఎమర్జెన్సీ విధించిన కిమ్ జాంగ్ ఉన్

ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు

Kim Jong Un
Kim Jong Un

ఉ.కొరియా: ఉత్తర కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కాగా, ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాలో అక్రమంగా చొరబడినట్టు భావిస్తున్నారు. ఆ వ్యక్తికి కరోనా ఉందన్న అనుమానాల దరిమిలా కిమ్ జాంగ్ ఉన్ వెంటనే పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే దేశంలో ఇదే తొలి కేసు కానుంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ప్రకటించిన కిమ్ సరిహద్దు నగరం కయసోంగ్ లో లాక్ డౌన్ ప్రకటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/