ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

శ్రీకాకుళంలో విషాదం

Killing two children. Mother commits suicide
Killing two children. Mother commits suicide

శ్రీకాకుళం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్ద‌రు పిల్ల‌లను చంపి.. ఆత‌ర్వాత ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఈ ఘ‌ట‌న దమ్మలవీధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ధనలక్ష్మి(35) త‌న ఇద్దరు పిల్లలు సోనియా(11) యశ్వంత్‌(9)లకు ఉరేసి తాను ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణాలను కుటుంబసభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/