పాక్‌ లో మరో దారుణం.

Pakistani Hindu girls,
Pakistani Hindu girls,

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌ లో మరో దారుణం చోటుచేసుకుంది.పాకిస్తాన్‌లో ఇద్దరు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి, వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన ఉదంతం జరిగి వారం రోజులు గడవక మునుపే మరో దారుణం కూడా సింధ్ ప్రావిన్స్‌లోనే జరిగింది.మెగావర్ కమ్యూనిటీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరి రాం కిషోరి లాల్ తెలిపారు. కాగా దీనికి సంబంధించిన వార్త ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.బడిన్ జిల్లాలోని యువతి టండో బఘో‌కు చెందినది. కాగా యువతి తండ్రి ఇప్పటికే బడిన్ ఎస్ఎస్‌పీ సర్దార్ హాసన్‌ నియాజిని కలుసుకున్నారు. అనంతరం తన కూతురు అదృష్యమైందని, వెంటనే తన కూతురును వెతికి తెచ్చివ్వాలని ఫిర్యాదు చేశారు.

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/