థాయ్‌లాండ్ మాస్టర్స్ నుంచి కిదాంబి ఔట్

Srikanth Kidambi
Srikanth Kidambi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్ మాస్టర్స్‌ నుంచి భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ టోర్నీలో అతడు మంచి ప్రదర్శన కనబర్చి ర్యాకింగ్‌ మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ అతడికి నిరాశే మిగిలింది. ఇండోనేషియాకు చెందిన షట్లర్‌ షెసర్‌ హిరెన్‌ చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. 48 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్‌ కిదాంబి ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలుత ఆధిపత్యం కనబర్చినా తర్వాత గేమ్స్‌లో కిదాంబి తేలిపోయాడు. మరోవైపు థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో మరో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. లీ జి జియా(మలేషియా) చేతిలో సమీర్‌ పరాజయాన్ని చవిచూసాడు. భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, ప్రణయ్ తమ ప్రత్యర్థులతో మరికాసేపట్లో తలపడనున్నారు. టోక్యో ఒలంపిక్స్‌లో అర్హత సాధించాలంటే ఏప్రిల్‌ 26 లోపు ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉండాలి. ప్రస్తుతం సైనా 22, శ్రీకాంత్‌ 26 ర్యాంకుల్లో ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/