పిబిఎల్‌ నుంచి తప్పుకున్న కిదాంబి శ్రీకాంత్‌

Srikanth Kidambi
Srikanth Kidambi

ఢిల్లీ: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పిబిఎల్‌) ఐదవ సీజన్‌ నుంచి భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ తప్పుకుంటున్నారు. 2020 టోక్యో ఒలంపిక్స్‌పై, ఇతర అంతర్జాతీయ టోర్నీలై మరింత దృష్టి సారించేదుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. పిబిఎల్‌ లీగ్‌లో బెంగళూరు రాఫ్టర్స్‌ ఫ్రాంచైజికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిదాంబి శ్రీకాంత్‌ గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిరాశ పరుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ టోర్నీలపై దృష్టి పెట్టేందుకు పిబిఎల్‌ ఐదో సీజన్‌కు దూరంగా ఉన్నానని, బెంగళూరు రాఫ్టర్స్‌కు తన మద్దతు ఎల్లపుడూ ఉంటుందని అన్నారు. ఈ ఏడాది రాఫ్టర్స్‌ అద్భుతంగా ప్రదర్శించాలని ఆశిస్తున్నానని శ్రీకాంత్‌ ట్వీట్‌ చేశారు. కాగా వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పిబిఎల్‌ లీగ్‌ జరగనుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/