కొరియా మాస్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఇంటిముఖం

kidambi srikanth
kidambi srikanth

గ్వాంగ్జు:(కొరియా) భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నమెంట్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో అతడు ఓటమి పాలయ్యాడు. జపాన్‌ ఆటగాడు కంటా సునెయామాతో జరిగిన పోరులో 14-21, 19-21 తేడాతో వరుస గేముల్లో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌ను ప్రత్యర్థి సునాయాసంగా కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ తొలుత కిదాంబి పుంజుకోలేదు. ప్రత్యర్థి నాలుగు పాయింట్ల తేడాతో ఆధిక్యంలోకి దూసుకెల్లాడు. ఈ క్రమంలో విజృంబించిన శ్రీకాంత్‌ ప్రత్యర్థితో తీవ్ర పోటీపడ్డాడు. పాయింట్ల సమం చేసుకుంటూ వెళ్లాడు. 19-19 వద్ద కిదాంబి తడబడటంతో సునెయామా వరుసగా 2 పాయింట్ల సాధించి విజయం అందుకున్నాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/