మరోసారి నిరాశపరిచిన కిదాంబి శ్రీకాంత్‌

Kidambi Srikanth
Kidambi Srikanth

టోక్యో: భారత్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ను అన్‌సీడ్‌ ప్రణయ్‌ 1321, 2111, 2120 తేడాతో మట్టికరిపించాడు. తొలిగేమ్‌లో ప్రణయ్‌పై శ్రీకాంత్‌ ఆధిపత్యం చెలాయించాడు. కానీ రెండోగేమ్‌లో ప్రణయ్‌ పుంజుకోని తిరిగి రేసులో నిలిచాడు. నిర్ణయాత్మకమైన మూడోగేమ్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. 2018తో ప్రణయ్‌ ఆధిక్యంలో ఉన్నా శ్రీకాంత్‌ పోరాడి 2020తో స్కోరుని సమం చేశాడు. కానీ చివరికి ప్రణయ్‌ పైచేయి సాధించాడు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/