ఏపి నుంచి తరలిపోనున్న కియా ప్లాంట్‌?

ఓ అంతర్జాతీయ మీడియా కథనం

KIA plant in Ap
KIA plant in Ap

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండలో అట్టహాసంగా ప్రారంభమైన దక్షిణకొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఈ కథనం ప్రచురితం చేసింది. కియా సంస్థ ఏడాదికి 3లక్షల యూనిట్ల ఉత్పాదనే లక్ష్యంగా కంపెనీని ప్రారంభించింది. అంతేకాదు ప్రత్యక్షంగా పరోక్షంగా 12వేల ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కియా మోటార్స్ ఏపీని వీడి తమిళనాడుకు తరలిపోతోందన్న వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే ఆ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందంటూ పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది. అయితే ఇప్పటికే ఏపీలో ఉన్న ప్లాంట్ నుంచి కార్ల ఉత్పత్తి కూడా పూర్తవుతోంది. మరి ఇలాంటి సమయంలో ఈ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించాలని కియా యాజమాన్యం ఎందుకు భావిస్తోంది అనేది తెలియాల్సిఉంది. అయితే తరలింపు ప్రయత్నాలు జరగట్లేదని కియ యాజమాన్యం చెబుతోంది. కాగా.. కియా మోటార్స్‌పై రాయిటర్స్‌ కథనం పూర్తిగా అవాస్తవమని… అసత్యాలతో కూడిన కథనమని.. పరిశ్రమలు జవాణిజ్యం జ పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. కియ, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రజత్‌ భార్గవ వెల్లడించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/