కియా ఎక్కడికీ వెళ్లట్లేదు..ఏపిలో ఉంటాం

కియా మోటార్స్‌ సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనాన్ని కియా మోటార్స్ తప్పుపట్టింది. తాము ఎక్కడికీ వెళ్లట్లేదని స్పష్టం చేసింది.

kia motors
kia motors

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుగొండలో ప్రారంభమైన దక్షిణకొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలను కియా మోటార్స్ యాజమాన్యం ఖండించింది. అయితే ఇదివరకు మహారాష్ట్రకు తరలించేస్తున్నామని ఇలాగే కథనాలు వచ్చాయన్న కియా మోటార్స్ తాజా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్న కియా మోటార్స్ తమ ప్లాంటులో 85 శాతం స్థానిక యువతే పనిచేస్తున్నారనీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతోందనీ క్లారిటీ ఇచ్చింది. అందువల్ల ఇవాళ రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనంలో నిజం లేదనేందుకు కియా మోటార్స్ ఇచ్చిన ప్రకటన బలం చేకూర్చుతోంది. కాగా ఏపి ప్రభుత్వం కూడా రాయిటర్స్ కథనాన్ని తప్పుపట్టింది. ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చింది. అసత్యాలతో కూడిన కథనం అని తెలిపింది. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయనీ ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/