బిజెపిలో చేరిన ఖుష్బూ సుంద‌ర్

An eminent personality joins BJP in presence of Shri L Murugan and Shri C.T. Ravi at BJP HQ.

న్యూఢిల్లీ: త‌మిళ సినీ న‌టి ,కాంగ్రెస్‌ పార్టీనాయకురాలు ఖుష్బూ సుంద‌ర్ సోమవారం ఆ పార్టీకి రాజానామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఖుష్బూ ఢిల్లీలోని బిజెపి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆమె కాషాయం కండువా క‌ప్పుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన చేరిక కార్య‌క్ర‌మంలో కుష్బూకు పార్టీ అభ్య‌ర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న‌త స్థాయిలో ఉన్న కొంద‌రు .. గ్రౌండ్ రియాల్టీ తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ఖుష్బూ ఇవాళ త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. 2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి నుంచి ఖుష్బూ పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. త‌మిళ‌నాడులో బిజెపి ముఖ‌చిత్రాన్ని ఖుష్బూ మార్చేస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/