రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీనే : ఖుష్బూ

హైదరాబాదులో మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రచారం

khushbu-attends-bjp-national-plenary

హైదరాబాద్ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదు వేదికగా షురూ కాగా, తమిళనాడు బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా, హైదరాబాదులో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పట్ల ఖుష్బూ విస్మయం వ్యక్తం చేశారు.

నగరంలో ఎక్కడ చూసినా ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారని… దీన్నిబట్టి మోడీ అంటే కేసీఆర్ కు భయం అన్న విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. మూడోసారి కూడా ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లకపోవడం చూస్తుంటే ఆయన ఆలోచనా విధానం ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీనే అని ఖుష్బూ ఉద్ఘాటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/