ఖుష్బూ : తృటిలో తప్పిన ప్రమాదం

కంటైనర్‌ను ఢీ కొట్టిన ఖుష్బూ కారు

Kushboo
Kushboo

Chennai: సీనియర్ నటి , బీజేపీ నేత కుష్బూ  రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక కంటైనర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు.  చెన్నైలోని మెల్మరువతూర్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్నకారు ఒక కంటైనర్ ను ఢీకొంది.

అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/