ఖిలాడీ నుండి ”అట్టా సూడకే” సాంగ్ విడుదల..

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడీ నుండి ”అట్టా సూడకే” సాంగ్ ను న్యూ ఇయర్ సందర్భాంగా చిత్ర యూనిట్ విడుదల చేసారు. రవితేజ-రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్నఈ మూవీ లో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనుండగా..డింపుల్ హయాతి, మీనాక్షీ చైదరి హీరోయిన్స్‌గా నటించారు. అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే” అంటూ సాగిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేశారు. అంతేకాదు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు. ఇక ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మరి మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video