తవాంగ్ ఘర్షణ..అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో భేటి కానున్న ఖర్గే

Mallikarjun Kharge
Mallikarjun Kharge

న్యూఢిల్లీః కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే.. మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానుండటంతో.. రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో చర్చించాలని ఖర్గే నిర్ణయించారు.

ఆ మేరకు మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నాయకులతో సమావేశం కాబోతున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని తవాంగ్‌ సెక్టార్‌లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణలు, ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. ఆయా అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ఇతర పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో డిస్కస్‌ చేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/