దాడులకు యత్నిస్తున్న ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు

సరిహద్దుల్లో అప్రమత్తమైన బలగాలు

terrorist
terrorist

పంజాబ్‌: పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల ద్వారా జమ్ముకశ్మీర్ లో హింసకు తెగబడేందుకు  ప్లాన్ యత్నిస్తు … మరోవైపు, పంజాబ్ లో దాడులకు ఖలిస్థాన్ ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది. పంజాబ్ లో ఉగ్రదాడులకు ఖలిస్థాన్ టెర్రరిస్టులు యత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ తెలిపింది. పాక్ నుంచి పంజాబ్ కు అక్రమంగా ఆయుధాలను తరలించడాన్ని ఖలిస్థాన్ టెర్రరిస్టులు ఇటీవలి కాలంలో ఎక్కువ చేశారని వెల్లడించింది. బబ్బర్ ఖల్సా, ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రసంస్థలు ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్నాయని తెలిపింది. రాజస్థాన్, హర్యానాలో కూడా ఖలిస్థాన్ కదలికలు కనిపిస్తున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్, ఎన్ఐఏ, రా, ఐబీలు ఖలిస్థాన్ ఉగ్రవాదులపై నిఘాను పెంచాయి. పంజాబ్, పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఖలిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడ శిక్షణ పొందుతున్నారే అంశంపై సమాచారం సేకరిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/