ముగిసిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

Khairatabad Ganesh 11
Khairatabad Ganesh 11

హైదరాబాద్‌: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య హుస్సేన్ సాగర్ లో శ్రీద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. మహాగణపతి విగ్రహం 61 అడుగుల ఎత్తు, 45 టన్నులకు పైగా బరువుంది. ఈ భారీ గణపతి కోసం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్ట్ లోని క్రేన్ నంబర్ 6 వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ ప్రాంతంలో నీటి లోతు 20 అడుగులకు పైగా ఉంది. ఈ ప్రాంతంలో భారీ క్రేన్ సహాయంతో మహాగణపతిని నిమజ్జనం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/